కమల్ సినీ ప్రస్థానానికి 61 ఏళ్ళు

కమల్ సినీ ప్రస్థానానికి 61 ఏళ్ళు

నటనలో సహజత్వం కనబరిచే హీరో ఎవరంటే చాలామంది లోకనాయకుడు కమల్ హాసన్ అని తడబడకుండా చెప్తారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ నటుడిగా 61 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు . నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడట కమల్ ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాల్లో నటించి మెప్పించారు.. 4 సంవత్సరాల వయస్సులో తన వృత్తిని ప్రారంభించిన కమల్ 1959 లో విడుదలైన కలతూర్ కన్నమ్మలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఆతర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ,నటించి . . ఇండియన్ సినిమా సాంకేతిక అంశాలలో చాలా మార్పులను తీసుకువచ్చారు.తనదైన కామిడీ టైమింగ్ తోను ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కమల్. బాలనటుడిగా నట ప్రస్థానం ప్రారంభించి... లోకనాయకుడిగా మారారు. మలయాళం లో వచ్చిన "కన్యాకుమారి" సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత బాషా బేధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా ఎదిగారు. అంతులేని కథ, మరో చరిత్ర , ,ఆకలి రాజ్యం, స్వాతి ముత్యం, సాగర సంగమం ,భారతీయుడు,దశావతారం ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఎన్నోమరెన్నో సినిమాలు.. కమల్ హాసన్ నటిస్తున్నారంటే ఆ సినిమాలో కమల్ కనిపించరు.. ఆ పాత్రే కనిపిస్తుంది. అంతలా పాత్రలో లీనమైపోతారు కమల్ .