నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని చూస్తున్న :  కమల్

నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని చూస్తున్న :  కమల్

విశ్వనటుడు కమల్ హాసన్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు . అద్భుతమైన సినిమాల్లో నటించిన కమల్ రాజకీయాల్లోకూడా రాణించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో కమల్ బరిలోకి దిగుతున్నాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కమల్ మార్చి నుండే ప్రచారం మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకుగాను మక్కల్‌ నీదిమయ్యం కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ అవసరమయితే తృతీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని కమల్‌ తెలిపారు. తమిళనాట నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని చూస్తున్న అని కమల్ స్పష్టం చేసారు కాగా కార్యనిర్వాహక కమిటీ సభ్యుల్లో పలువురు ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. మరికొందరు జాతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోవడం సమంజసంగా ఉంటుందని సలహా ఇచ్చారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల పనులను ముమ్మరం చేయాలని సూచించారు.ఎన్నికల పొత్తును ఖరారు చేసుకోవడానికి ముందుగానే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసి గెలిచే సత్తా కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. ఇక అభ్యర్థుల జాబితాను తాను నిశితంగా పరిశీలిస్తానని కమల్‌ తెలిపారు.