కేసీఆర్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ..
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు టీడీపీ, ఏపీ అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖరాశారు. మీ భవిష్యత్ మా బాధ్యత అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ భవిష్యత్ తన బాధ్యత అంటూ సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆన ఎద్దేవా చేశారు. అవినీతి డైనోసార్ జగన్ కుట్రలకు లోటస్‌పాండ్ కేంద్రంగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అందిస్తున్నారని ఆరోపించిన కళా వెంకట్రావు.. 1985లోనే కార్యకర్తల వివరాలను సేకరించినప్పుడు మీరు కూడా టీడీపీ కార్యకర్తేనని మరిచారా..? అంటూ ప్రశ్నించారు. ఆధార్ నంబర్లు తీసుకున్నారని ఆరోపిస్తున్నవారు.. ఆ నంబర్లతో ఏం చేయగలరో చెప్పాలని డిమాండ్ చేశారు. నా ఆధార్ నంబర్ ఇస్తాను.. ఏం చేస్తారో చెప్పగలరు..? అంటూ సవాల్ చేశారు కళా వెంకట్రావు. హైదరాబాద్‌లో వ్యాపారాలున్న టీడీపీ నేతలు వైసీపీలో చేరడం వెనుక సీఎం కేసీఆర్ బెదిరింపులు లేవా.? అని లేఖలో ప్రశ్నించారు కళా వెంకట్రావు. మొత్తం 22 ప్రశ్నలను సందిస్తూ కేసీఆర్‌కు సుదీర్ఘమైన లేఖరాశారాయన.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)