అవి తోలు బొమ్మ పార్టీలు..

అవి తోలు బొమ్మ పార్టీలు..

ఏపీ ప్రజలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏవిధంగా బాగు చేస్తారో చెప్పాలి అని మంత్రి కళా వెంకట్రావ్ డిమాండ్ చేసారు. ఈ రోజు ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ... రాజకీయం గురించి తెలియని వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. రాజకీయాల కోసం ప్రాంతం, మతాలను రెచ్చకొట్టి విషబీజాలు నాటడం మంచిది కాదన్నారు. ఏ స్వరూపం లేని సింగిల్ మెన్ పార్టీ జనసేన పార్టీ అని ఆయన విమర్చించారు. పవన్ కళ్యాణ్ నువ్వు సింగిల్ మేన్ ఆర్మీ కాదు.. సోలో సింగిల్ మేన్ వి అని అన్నారు. పవన్ గారికి రాజకీయం అనుభవం లేదు.. ఎవరో ఏదో చెప్తే మాట్లాడుతున్నారు.. ఆయన మాటలతో ఎవరు ఎంత బాధపడతారో అర్థం కావడం లేదన్నారు. ప్రజలకు మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటో జనసేనాని చెప్పాలని కళా వెంకట్రావ్ డిమాండ్ చేశారు.

ఏపీ ప్రజలను పవన్ కళ్యాణ్ ఏవిధంగా బాగు చేస్తారో చెప్పాలన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసిన పార్టీ నుంచి పుట్టిందే వైసీపీ అని విమర్శించారు. వీధుల్లో మనుషుల్ని నిల్చోపెట్టి జనం వచ్చారని చెప్పుకునే పార్టీ వైసీపీ అని విమర్చించారు. వైసీపీ, జనసేన పార్టీల నాయకులు బీజేపీ పార్టీ ఆడిస్తున్న తోలు బొమ్మలు అని వెంకట్రావ్ తెలిపారు.