ప్రభుదేవా సరసన కాజల్ !
పంచదార బొమ్మ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే హీరోయిన్ కాజల్ అగర్వాల్. తనవైన సోయగాలతో కుర్రకారు మనసుల్ని దోచేసింది. పంచదార బొమ్మ అంటూ అందరిని కలవరపరిచింది. అయితే సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్‌కి పెళ్లైతే ఆమెకు ఆఫర్లు తగ్గుతాయి. ఈ అమ్మడు విషయంలో మాత్రం అలా జరగలేదు. అయితే.. తాజాగా అందల భామ కాజల్ అగర్వాల్, ప్రభుదేవా కాంబోలో ఓ తమిళ సినిమా చేయబోతున్నారట. ఈ మూవీ రొమాంటిక్, కామెడీ బ్యాగ్ గ్రౌండ్‌తో తెరకెక్కించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే.. ఈ సినిమాను కళ్యాణ్ డైరెక్షన్ చేస్తున్నాడట. ఈ మూవీ పూర్తి వివరాలను త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఇంతకు ముందు డీకే దర్శకత్వంలో హారర్ సినిమాలో కాజల్, ప్రభుదేవా జంటగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు ప్రకటించాక చిత్ర బృందం నుంచి ఇప్పటి దాకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి సరసన "ఆచార్య" మూవీలో నటిస్తుంది. ఆచార్య సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో పూర్తికావస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభుదేవా సినిమాను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)