ఫిబ్రవరి 12న కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 12న హాట్ స్టార్‌లో రానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు. పోస్టర్ ను బట్టి చుస్తే ఈ సిరీస్ హారర్ థ్రిల్లర్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఈ ‘లైవ్ టెలికాస్ట్’ తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠి భాషల్లో అందుబాటులోకి వస్తోంది. కాజల్ వెబ్ సిరీస్ లో నటించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కాజల్ చిరంజీవి సరసన ‘ఆచార్య’లో నటిస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)