పెళ్లివేడుకలో చిందులేసిన చందమామ

పెళ్లివేడుకలో చిందులేసిన చందమామ

బ్యాచిల‌ర్ లైఫ్‌కు బైబై చెప్పేసింది అందాల చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్. ఈ రోజు సాయంత్రానికి త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుతో కాజ‌ల్ ఏడ‌డుగులు వెయ్యబోతుంది. కాజ‌ల్ ఇంట జరుగుతున్న వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.  ఇక ఇటీవలే ఈ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియోలో కాజల్ తీన్మార్ బ్యాండ్ పై స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. ఇక కాజ‌ల్ పెళ్ళి వేడుక‌కి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌న్నింటిని ఆమె సోద‌రి నిషా అగ‌ర్వాల్ చూసుకుంటుంది. తాజాగా పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తమ కలల రాణి పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో అభిమానులు ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు పెళ్లి తరువాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తానని ఇప్పటికే ప్రకటించింది.