కాజల్ కి అన్నగా మంచు విష్ణు...

కాజల్ కి అన్నగా మంచు విష్ణు...

టాలీవుడ్ హీరో మంచు వారబ్బాయి విష్ణు అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కలిసి మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నారు. కానీ ఈ సినిమాలో వీరిద్దరూ అన్న చెల్లిగా నటిస్తున్నారు. ఇలా ఇద్దరు హీరో హీరోయిన్లు  అన్న చెల్లిగా నటించడం బాలీవుడ్ లో కూడా జరిగింది. జోష్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ అన్న చెల్లిగా నటించారు. ఇక ఈ సినిమా పై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ... ఈ సినిమా యూనివర్సల్ స్టోరీతో వస్తున్నట్లు తెలిపాడు. అయితే హాలీవుడ్ లో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని, అయిన కూడా మన తెలుగు నేటివిటీకి తగట్టు కథలో లో కొన్ని మార్పులు చేసినట్లు చెప్పాడు. ఇక ఈ సినిమా నాకు సూపర్ హిట్ ను అందిస్తోందని విష్ణు చెప్పుకొచ్చారు. అయితే గత కొంత కాలంగా విష్ణుకు సరైన హిట్ లేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కా్‌మ్‌ నేపథ్యంలో వస్తున్నట్లు తెలుస్తుంది. 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.