ఐపీఎల్ లో రబడాకు ఇదే మొదటి మ్యాచ్... ఎలాఅంటే..?  

ఐపీఎల్ లో రబడాకు ఇదే మొదటి మ్యాచ్... ఎలాఅంటే..?  

ఐపీఎల్ 2020 లో నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 88 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ భారీ విజయంలో డేవిడ్ వార్నర్, సాహా, మనీష్ పాండే, రషీద్ ఖాన్ ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 219 పరుగులు చేయగా ఢిల్లీ 131 పరుగులకే  కుప్పకూలింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ కగిసో రబడా కు వికెట్ లేని తొలి మ్యాచ్ ఇదే అయ్యింది. ఇప్పటివరకు మొత్తం 30 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన రబడా 54 వికెట్లు తీసుకున్నాడు. ఈ 30 మ్యాచ్ లలో ఒక వికెట్ అయిన సాధించాడు. కానీ రబడా ఈ మ్యాచ్ లో 4 ఓవర్ల వేసి 54 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు. దాంతో రబడాకు వికెట్ లేని తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే. ఇక ఐపీఎల్ లో ఢిల్లీకి ఇది 5వ ఓటమి. ఈ పరాజయం కారణంగా ఢిల్లీ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి  వచ్చింది. విజయం సాధించిన సన్‌రైజర్స్ 6వ స్థానానికి వెళ్ళింది.