‘చెప్పి తీరాల్సిన కథలు’ ఉన్నాయంటోన్న కబీర్ బేడి

‘చెప్పి తీరాల్సిన కథలు’ ఉన్నాయంటోన్న కబీర్ బేడి

ప్రముఖ బాలీవుడ్ నటుడు, యూరోపియన్, అమెరికన్ సినీ, టీవీ రంగాల్లోనూ తనకంటూ గుర్తింపు సాధించుకున్న వెటరన్... కబీర్ బేడీ ఆత్మకథా రాశాడు. ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్’ అని పుస్తకానికి నామకరణం చేశాడు. ఈ విషయాన్ని తన ఇస్టాగ్రామ్ లో ప్రకటించిన ఆయన ఏప్రిల్ లో మెమైర్ విడుదలవుతుందని చెప్పాడు. 

తన ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్’ పుస్తకంలో చాలా విషయాలు స్పృశించాడట కబీర్ బేడీ. తన సుదీర్ఘ నట జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకుల్ని స్వచ్ఛమైన భావోద్వేగపూరిత నిజాయితీతో వివరించానని ఆయన అంటున్నాడు. అంతే కాదు, తన రిలేషన్‌ షిప్స్, మ్యారెజెస్, డైవోర్స్, మారుతూ వచ్చిన తన నమ్మకాలు, ఇండియా, యూరోప్, హాలీవుడ్ లో నటుడిగా తన పయనం... ఇవన్నీ కూలంకషంగా చర్చిస్తాడట. 

దాదాపు 65 హిందీ సినిమాల్లో నటించిన కబీర్ బేడీ జేమ్స్ బాండ్ ను ఢీకొట్టే విలన్ గా కూడా తెరపై మెప్పించాడు. అతడికి యూరప్ లోనూ ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. టెలివిజన్ యాక్టర్ గా అమెరికా, యూరోప్ ఆడియన్స్ ని కబీర్ బేడీ ఎన్నో షోస్ ద్వారా ఎంటర్టైన్ చేశాడు...