గ్రేటర్ వార్: కెఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు 

గ్రేటర్ వార్: కెఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు 

రేపు గ్రేటర్ హైదరాబాద్ కు ఎన్నికలు జరగబోతున్నాయి.  గ్రేటర్ లో జరుగుతున్న ఎన్నికలపై కెఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రేపు జరిగే ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు వేయాలని, డబ్బుకు, ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు ఓటు వేయాలని అన్నారు. విలువైన ఓటును అమ్ముకోవద్దని అన్నారు.  కుల, మతాలకు అతీతంగా ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో మార్పు తేవాలని, మార్పు రావాలని కెఏ పాల్ పేర్కొన్నారు.  రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు జరగబోతున్నాయి.  పోలింగ్ ను ఈవీఎం ద్వారా కాకుండా ఈసారి బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలను నిర్వహిస్తున్నారు.  కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.  కరోనా కారణంగా పోలింగ్ బూత్ సంఖ్యను కూడా పెద్ద సంఖ్యలో పెంచిన సంగతి తెలిసిందే.