వార్నర్ విషయంలో ఫలించిన రాహుల్ వ్యాఖ్యలు...

వార్నర్ విషయంలో ఫలించిన రాహుల్ వ్యాఖ్యలు...

ఆస్ట్రేలియా తో జరిగిన రెండు వన్డే మ్యాచ్ లలో భారత్ ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మైదానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సరదాగా... వార్నర్ గాయం ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ జోక్ చేసాడు. అలా జరిగితే భారత్ కు కలిసి వస్తుంది అని అన్నాడు. ప్రస్తుత పరిస్థితులబట్టి చూస్తే రాహుల్ వ్యాఖ్యలు ఫలించినట్లు అనిపిస్తుంది. అయితే మొదట గాయం తీవ్రత కారణంగా వార్నర్ భారత్ తో జరగనున్న నామమాత్రపు మూడో వన్డేతో పాటు తర్వాత ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉండడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ స్పష్టం చేశాడు. కానీ ఇప్పుడు తాజాగా వార్నర్ కు నొప్పి ఎక్కువగా ఉంది. కాబట్టి అతను డిసెంబర్ 17 న ఈ రెండు జట్ల మధ్య జరగనున్న డే-నైట్ మ్యాచ్ లో ఆడటం కూడా అనుమానమే అని జస్టిన్ లాంగర్ చెప్పాడు. కానీ అతను అప్పటి వరకు ఫిట్నెస్ సాధించాలని తాను కోరుకుంటున్నట్లు కూడా తెలిపాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.