యూపీలో కామాంధులలో కాటుకు యువతి బలి... వెన్నుముఖ దెబ్బతిని, కాళ్లు చచ్చుబడి !

యూపీలో కామాంధులలో కాటుకు యువతి బలి... వెన్నుముఖ దెబ్బతిని, కాళ్లు చచ్చుబడి !

ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్‌ జిల్లాలో సెప్టెంబర్‌ 14న తన కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లింది యువతి. తల్లి, సోదరుడికి కొంచెం వెనుకగా గడ్డి కోస్తుండగా అక్కడే మాటు వేసి ఉన్న నలుగురు అగ్రకులాలకు చెందిన యువకులు ఆమెను పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. మెడకు చున్నీ చుట్టి హింసించారు. ఏమాత్రం జాలి, దయ లేకుండా యువతి నాలుకను కోసి చిత్ర హింసలకు గురి చేశారు. అయితే కూతురు కనిపించకపోవడంతో వెనక్కి వెళ్లి చూసింది బాధితురాలి తల్లి. 

తీవ్ర గాయాలతో, రక్తస్రావంతో నిస్సహాయంగా పడి ఉన్న కూతురిని వెంటనే ఆసుపత్రికి తరలించింది. అయితే పరిస్థితి విషమించడంతో బాధితురాలిని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.  బాధితురాలి వెన్నుముఖ  క దెబ్బతినడంతో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. ఇంటర్‌నల్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నంది. శరీరమంతా గాయాలు, నాలుక కూడా కోసి హింసించారు కిరాతకులు. ఈ దారుణమారణ కాండ నుంచి కోలుకోలేక  కన్నుమూసింది మరో నిర్భయ. దాదాపు 15 రోజులు నరకయాతన పడి మృత్యు ఒడికి చేరుకుంది.

యూపీలో జరిగిన ఈ ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబికింది. అయితే యూపీ పోలీసులు నిందితులకే వంత పాడారన్న విమర్శలు వచ్చాయి. తన కూతురు అత్యాచారానికి గురైందని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదు. నిరసనలకు దిగితే కాని నిందితులను పట్టుకోలేదు పోలీసులు. అత్యాచారం జరిగిన నాలుగు రోజులు తరువాత నలుగురు కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై మండిపడుతున్నాయి దళిత సంఘాలు. అయితే ఇదంతా అవాస్తవమని, తాము సకాలంలోనే స్పందించామని అంటున్నారు పోలీసులు.