ముహూర్తం పిచ్చే కొంప ముంచింది...

ముహూర్తం పిచ్చే కొంప ముంచింది...

గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం నియమించిన సోమయాజులు కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2015 జులై 15వ తేదీన గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మందికి పైగా మృతిచెందారు. ఒకే ముహూర్తంలో స్నానాలు చేయాలన్న పిచ్చి నమ్మకం వల్లనే ప్రమాదం జరిగినట్టు సోమయాజులు కమిషన్ పేర్కొంది... అతిసయోక్తితో కూడిన సిద్ధాంత రాద్ధాంతం వల్లనే ప్రమాదం జరిగిందన్న కమిషన్... ఒకే రోజు ఒకే మొహూర్తం పుష్కర స్నానం చేయాలన్న సాంప్రదాయం ఎక్కడా లేదంది... గుడ్డి నమ్మకాలతో ప్రజలు విపత్తును గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేసిన సోమయాజులు... పుష్కరమూహూర్తంపై ప్రసార మాధ్యమాల్లో ఎక్కువ ప్రచారం కావడం కూడా ప్రమాదానికి కారణమైందన్నారు. 

తొక్కిసలాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారణం కాదని తేల్చింది సోమయాజులు కమిషన్... సీఎం కారణంగానే పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగిందంటూ విపక్షాలు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి పుష్కరఘాట్‌ నుంచి వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేసింది సోయమాజులు కమిషన్... కొందరు సీఎంను దోషిగా నిలబట్టే ప్రయత్నం చేశారని... మృతుల కుటుంబాలకు, బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే పరిహారం చెల్లించిందని తెలిపారు. పుర్కరఘాట్‌లో ప్రమాదంపై పలుమార్లు బహిరంగ విచారణ నిర్వహించిన ఏకసభ్య కమిషన్... సుదీర్ఘ విచారణ తర్వాత నివేదిక సమర్పించింది.