ఏపీకి అన్యాయంపై కేసీఆర్ పట్టించుకోరా..?

ఏపీకి అన్యాయంపై కేసీఆర్ పట్టించుకోరా..?

ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటే.. ఒక తెలుగువాడిగా కేసీఆర్ పట్టించుకోరా అన్నారు ఏపీ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్.. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రపదేశ్ అభివృద్ధికి కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి రాకుండా చూడటమే బీజేపీ లక్ష్యమా అంటూ ఆరోపించారు. బీజేపీకి రెండు సీట్లు కాదు కదా.. రెండు ఓట్లు కూడా రావని ప్రభాకర్ జోస్యం చెప్పారు. ఒక్క ఏపీనే బీజేపీ టార్గెట్ చేస్తోందని.. చంద్రబాబును నిందించడమే బీజేపీ-వైసీపీలు అజెండాగా పెట్టుకున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ దేశవ్యాప్తంగా దళితులపై దాడులకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వవలసిని అవసరం లేదని.. నాలుగేళ్లు మాతో కలిసుండి.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడం వెనుక కుట్ర కోణం ఉందని.. త్వరలోనే పవ్ కుట్రలు బయటపెడతామని జూపూడి తెలిపారు. నెల్లూరులో వైసీపీ ఒక డూప్లీకెట్ దీక్ష చేస్తోందని.. అది పబ్లిసిటీ కోసం తప్పించి రాష్ట్రం కోసం కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికే నవనిర్మాణ దీక్షకు పిలుపునిచ్చినట్లు జూపూడి ప్రభాకర్ వెల్లడించారు.