మంత్రిని అడ్డుకున్న జూనియర్ లాయర్లు

మంత్రిని అడ్డుకున్న జూనియర్ లాయర్లు

రవీంద్రభారతీలో న్యాయవాదులకు హెల్త్ కార్డులు, చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి న్యాయవాదులకు చెక్కులు, హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతుండగా..  జూనియర్ న్యాయవాదులు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారి వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీనియర్ న్యాయవాదులు.. జూనియర్లతో వాగ్వివాదానికి దిగారు. మధ్యలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.. యువ న్యాయవాదులకు వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు అవసరమైన శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని.. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అన్ని కోర్టులలో న్యాయవాదుల కోసం వెయిటింగ్ హాల్స్ నిర్మించేలా ప్రజాప్రతినిధులు నిధులు ఇవ్వాలని కోరుతానని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.