రివ్యూ: జుమాంజి నెక్స్ట్ లెవెల్ 

రివ్యూ: జుమాంజి నెక్స్ట్ లెవెల్ 

నటీనటులు: డ్వెన్ జాన్సన్, జాన్ బ్లాక్, కెవిన్ హార్ట్, నిక్ జోనాస్, కరెన్ గిల్లాన్ తదితరులు 

మ్యూజిక్: హేన్రి జాక్ మెన్ 

సినిమాటోగ్రఫీ: పాడోస్ 

నిర్మాత: డ్వెన్ జాన్సన్, డానీ గార్షియా, హిరమ్ గార్షియా 

దర్శకత్వం: జేక్ జేక్ కష్డన్ 

జుమాంజి సీరీస్ లో వచ్చిన సినిమాలు మంచి హిట్ అవుతూ వస్తున్నాయి.  ఒక వీడియో గేమ్ ఆధారంగా సినిమాలు రూపొందుతున్నాయి.  వీడియో గేమ్ ఉన్న గదిలోకి వెళ్లిన వ్యక్తులు తమకు తెలియకుండానే ఆ గేమ్ లోని వాళ్ళను ఆకర్షిస్తుంది.  అక్కడి నుంచి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్లకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు.  వాటి నుంచి తప్పించుకొని ఎలా తిరిగి బయటకు వచ్చారు అన్నది కథ.  ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలకు మూలకథ ఇదే అయినప్పటికీ ప్రతి సినిమాకు కథనాలు మారిపోయాయి.  ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పేరుతో సినిమా వచ్చింది.  మరి ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.   

కథ: 

మొదటి భాగంలో వీడియో గేమ్ బద్దలు చేసిన సంగతి తెలిసిందే కదా.  బద్దలైన వీడియో గేమ్ ను స్పెన్సర్ తిరిగి రిపేర్ చేసి వీడియో గేమ్ ఆడుతుంటాడు.  అదే సమయంలో తన స్నేహితులు స్పెన్సర్ ను వెతుక్కుంటూ రాగా, స్పెన్సర్ మాయం అవుతాడు.  అడవిలో చిక్కుకొని ఉంటాడని భావించిన స్నేహితులు కూడా స్పెన్సర్ ను వెతుక్కుంటూ వీడియో గేమ్ ద్వారా అడవిలోకి వెళ్తారు... ఆ తరువాత ఏం జరిగింది అన్నది కథ.  

విశ్లేషణ: 

వీడియో గేమ్స్ అంటే ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు.  వీడియో గేమ్స్ ఆడుతుంటే సమయం తెలియదు.  ఒక్కో లెవెల్ ను దాటుకుంటూ వెళ్లే కొలది ఆసక్తి పెరుగుతుంది.  ఇదే విధంగా జుమాంజి సినిమాలో కూడా జరిగింది.  వీడియో గేమ్ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.  వీడియో గేమ్ ద్వారా అడవుల్లోకి వెళ్లిన నటులు, అక్కడి నుంచి తమ లక్ష్యాన్ని చేసుకోవడానికి ఎలాంటి సాహసాలు చేశారు అనే విషయాన్ని సిల్వర్ స్క్రీన్ పై చక్కగా చూపించారు.   బాలలను వినియోగించుకొని, బలహీనతలు దాటుకుంటూ లక్ష్యాన్ని చేరుకునే విధానాన్ని ఆసక్తిగా చూపించారు.  

నటీనటుల పనితీరు: 

  డ్వెన్ జాన్సన్, జాన్ బ్లాక్, కెవిన్ హార్ట్, నిక్ జోనాస్, కరెన్ గిల్లాన్ తదితరులు సినిమాకు ప్రాణం పోశారు.  పోటీపడి నటించారు.  సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఆద్యంతం ఆసక్తిగా తీర్చిదిద్దారట.  

బలాలు : 

యాక్షన్ 

నటీనటులు 

బలహీనతలు: 

అక్కడక్కడా సాగతీత 

చివరిగా: జుమాంజి నెక్స్ట్ లెవెల్ : కాసేపు కాలక్షేపం