ఇద్దరూ ఇద్దరే.. మెంటలెక్కించారు..!!

ఇద్దరూ ఇద్దరే.. మెంటలెక్కించారు..!!

మెంటల్ హై క్యా మూవీ కోసం అందరుఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  దీనికి రెండు కారణాలు ఉన్నాయి.  ఒకటి కంగనా రనౌత్.  ఈ సినిమాలో మ్యాడ్ గర్ల్ గా నటన అద్భుతంగా నటించింది అనే టాక్ మొదటి నుంచి వచ్చింది.  పైగా అంతకు ముందు రిలీజ్ చేసిన ఫోటోలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.  

రెండోది ప్రకాష్ కోవెలమూడి.  కె రాఘవేంద్రరావు తనయుడు ఈ సినిమా దర్శకుడు.  టాలీవుడ్ లో రాఘవేంద్రరావుకు మంచి పేరు ఉన్నది.  అయన కుమారుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ ట్రైలర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయ్యింది.  ఒక మర్డర్ కు సంబంధించి పోలీసులు ఇద్దర్ని అనుమానిస్తారు.  ఆ ఇద్దరు కంగనా, రాజ్ కుమార్ రావు.  ఇద్దరు మెంటల్ గా చాలా డిస్టర్బ్ గా ఉంటారు.  పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు.  వారి చేష్టలతో అందరికి మెంటల్ వచ్చేలా చేస్తుంటారు.  ఈ ట్రైలర్ చూస్తే అదే అర్ధం అవుతుంది.  ఇద్దరు మ్యాడ్ గైస్ గా అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చారు.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే కదా.