రివ్యూ: జడ్జిమెంటల్ హై క్యా

రివ్యూ: జడ్జిమెంటల్ హై క్యా

నటీనటులు: కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావు, జిమ్మీ షేర్గిల్‌, అమైరా దస్తూర్‌ తదితరులు

మ్యూజిక్: తనిష్క్ బాఘ్చి 

సినిమాటోగ్రఫీ : పంకజ్ కుమార్ 

నిర్మాణం: బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌, ఏఎల్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌

దర్శకత్వం: ప్రకాశ్ కోవెలమూడి 

బాలీవుడ్ లో కంగన సినిమాలకు డిమాండ్ ఉన్నది.  ముద్దుగా ఆమెను బాలీవుడ్ క్వీన్ అని పిలుస్తుంటారు.  ఆమె నటించిన మణికర్ణికా సినిమా మంచి విజయాన్ని నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే.  సినిమా పరంగా ఎంత సక్సెస్ గా ఉంటుందో వివాదాల పరంగా కూడా అదే రేంజ్ లో ఉంటుంది.  ఇది  వేరే సంగతి అనుకోండి.  కంగన, రాజ్ కుమార్ రావు నటించిన జడ్జిమెంటల్ హై క్యా సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.  

కథ : 

కంగనా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్.  సినిమాలకు డబ్బింగ్ చెప్పే వృత్తిని ఎంచుకొని జీవిస్తుంటుంది.  అయితే, చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన కారణంగా ఎక్యూట్ సైకోసిస్ అనే వ్యాధితో బాధపడుతుంటుంది.  చేస్తున్న పనిలో పూర్తిగా లీనమై.. ఆ పనిలోకి పరకాయ ప్రవేశం చేయడం లాంటిది.  డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడంతో ఆయా పాత్రలు తానే చేస్తున్నట్టుగాఊహించుకుంటుంది. డ్రెస్ కూడా పాత్రలకు తగ్గట్టుగా వేసుకొని హంగామా చేస్తుంది.  ఇదే సమయంలో కంగనా ఉండే ఇంట్లోకి రాజ్ కుమార్ రావు, అమైరా దస్తూర్ లు అద్దెకు దిగుతారు.  రాజ్ కుమార్ ను చూడగానే కంగనా ప్రేమలో పడుతుంది.  అనుకోకుండా ఒకరోజు అమైరా దస్తూర్ హత్యకు గురవుతుంది.  ఆ హత్యచేసింది రాజ్ కుమార్ అని కంగన చెప్పడంతో షాక్ అవుతాడు.  నిజంగా రాజ్ కుమార్ ఈ హత్య చేశాడా లేదా? ఎవరు అమైరాను చంపారు అన్నది కథ.  

విశ్లేషణ: 

థ్రిల్లింగ్ హర్రర్ జానర్లో తెరకెక్కిన సినిమా ఇది.  ఇంకోరకంగా చెప్పాలి అంటే ఇది డార్క్ కామెడీ డ్రామా మూవీ.  కథ, కథనాలు ఎంత బాగున్నా ఆ కథనాలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకోకపోతే.. అది సినిమాకు మైనస్ అవుతుంది.  ఈ మూవీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ పాత్రకు కంగనాను ఎంచుకోవడం ప్లస్ అయ్యింది.  కంగనా యాటిట్యూడ్ తో సినిమాలో అదరగొట్టింది.  పాత్రలను ఊహించుకుంటూ ప్రవర్తించడం అన్నది కొత్త పాయింట్.  ఈ పాయింట్ కు కంగనా నూటికి నూరుపాళ్లు న్యాయం చేసింది.  కంగనా విచిత్రమైన వేషధారణతో ఆకట్టుకుంది.  మర్డర్ కేసులో ఆమె పోలీసులతో మాట్లాడే తీరు చూస్తే నవ్వొస్తుంది.  ఫస్ట్ హాఫ్ వరకు కంగనా క్యారెక్టర్, ఆమె యాటిట్యూడ్ ను చూపించారు.  సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలౌతుంది.  మర్డర్ మిస్టరీని ఛేదించడంలో కొంత సాగతీతలా కనిపిస్తుంది.  

నటీనటుల పనితీరు: 

సినిమాకు కంగనా రనౌత్  ను ఎంచుకోవడం డబుల్ ప్లస్ అయ్యింది.  ఆమె తెరపై కనిపించిన తీరు వేషభాషలు, హావభావాలు సూపర్బ్ అని చెప్పాలి.  రాజ్ కుమార్ రావు కూడా పోటీ పది నటించారు.  అమైరా పాత్ర తక్కువే అయినా ఆకట్టుకుంది. 

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి కొత్త పాయింట్ ను ఎంచుకొని దానికి తగ్గట్టుగా కథనాలు తయారు చేసుకొని ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది.  ఇలాంటి సినిమాలు ఫొటోగ్రఫీ, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ చాల అవసరం.  ఈ రెండు సినిమాకు ప్లస్ అయ్యాయి.  ఏక్తా కపూర్ నిర్మాణ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

కథ

కథనాలు 

మ్యూజిక్ 

నెగెటివ్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ లో సాగతీత 

చివరిగా :  జడ్జిమెంటల్ హై క్యా - ఓ కొత్త తరహా ప్రయోగం