ఎన్టీఆర్, విజయ్ తో అట్లీ మల్టీస్టారర్

ఎన్టీఆర్, విజయ్ తో అట్లీ మల్టీస్టారర్

తెలుగునాట యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళనాట ఇళయ దళపతి విజయ్ సినిమాకు ఉండే క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్'తో జూనియర్ తమిళనాట డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ సినిమాల ద్వారాకూడా తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు జూనియర్. అలాగే విజయ్ సినిమాలు కూడా తెలుగునాట అనువాద రూపంలో సందడి చేస్తూనే ఉన్నాయి. ఇటీవల వచ్చిన 'మాస్టర్' తెలుగు రాష్ట్రాలలో కూడా చక్కటి వసూళ్ళను సాధించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలసి ఓ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? ఈ రేర్ కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే వినిపిస్తోంది.

ఈ కాంబినేషన్ కోసం దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. విజయ్ తో ఇప్పటికే సినిమాలు చేసి ఉన్నాడు అట్లీ. ఇక ఎన్టీఆర్ తోనూ సినిమా చేయాలని గత కొంత కాలంగా ప్రయత్నాల్లో ఉన్నాడు. అట్లీ సినిమా అంటే విజయ్ ఎప్పుడూ నో చెప్పడు. ఇక ఎన్టీఆర్ తో అట్లీ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఉంటుందని ఎప్పటినుంచో వినవస్తోంది. ఎందుకో కానీ ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు తనతో చేయటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి... ఈ ఇద్దరినీ కలిపి మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందట అట్లీకి. అలా వారిద్దరి ఇమేజ్ కి సరిపడా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. ఇది నిజమే అయితే ఇటు తారక్ అటు విజయ్ అభిమానులకు పండగే. ప్రస్తుతం ఎన్టీఆర్- చరణ్ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' భారీ పాన్డి ఇండియా చిత్రంగా రానుంది. దర్శకుడు అట్లీ కూడా మ్యాజిక్ చేసి ఎన్టీఆర్-విజయ్ కాంబో సెట్ చేస్తే అది అంతకు మించి భారీ ప్యాన్ ఇండియా సినిమాగా తయారవటం ఖాయం. ప్రస్తుతం తారక్ కొరటాల, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు తో సినిమాలు చేయబోతున్నాడు. మరి ఈ క్యూలో అట్లీ సినిమా ఎక్కడ దూరుతుందో చూద్దాం.