బయో బబుల్ నుండి బయటకు వచ్చిన బట్లర్...

బయో బబుల్ నుండి బయటకు వచ్చిన బట్లర్...

ప్రస్తుతం ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా ఆ మ్యాచ్ లు అని బయో బబుల్ లో జరుగుతున్నాయి. అంటే అందులో ఉన్న ఆటగాళ్లు ఎవరు బయటివారిని కలవకూడదు. అయితే అందులో ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ లలో గెలిచిన ఇంగ్లాడ్ సిరీస్ కూడా సొంతం చేసుకుంది. ఆ రెండు మ్యాచ్ల విజయాలలో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్ ఇప్పుడు బయో బబుల్ నుండి బయటకు వచ్చేసాడు. బట్లర్ ఆ రెండు మ్యాచ్ లలో కలిపి మొత్తం 121 పరుగులు చేసాడు. కానీ ఇప్పుడు తన కుటుంబంతో కలిసి ఉండటానికి సౌతాంప్టన్ లోని బయో బబుల్ ను విడిచిపెట్టాడు. అందువల్ల సెప్టెంబర్ 8న ఆస్ట్రేలియాతో  జరగనున్న 3వ టీ 20 లో బట్లర్ పాల్గొనలేడు. ఇందులో ఇప్పటికే సిరీస్ ఇంగ్లాండ్ తమ సొంతం చేసుకుంది. కానీ మళ్ళీ ఈ నెల 11 నుండి ప్రారంభం వన్డే సిరీస్ కు అతను అందుబాటులోకి వస్తాడా.. లేదా అనే విషయం తెలియదు.