కరోనా బాధితులకు జోస్ బట్లర్ సాయం... ఏ విధంగా అంటే..?

కరోనా బాధితులకు జోస్ బట్లర్ సాయం... ఏ విధంగా అంటే..?

చైనా నుండి వచ్చిన కరోనా కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అయితే ఈ వైరస్ కారణంగా చాల దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే ఈ వైరస్ ను ఎదుర్కోవడం లో క్రికెటర్లు అందరూ తమ ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జోస్ బట్లర్ కరోనా బాధితులకు సహాయం అందించడానికి ఓ కొత్త తరహా ఆలోచనతో ముందుకు వచ్చాడు. అదేంటంటే బట్లర్ తన 2019 ప్రపంచ కప్ మ్యాచ్ కు సంబంధించిన టీ షార్ట్ ను వేలం లో పెట్టి వచ్చిన ఆ డబ్బును కరోనా బాధితుల సహాయం కొరకు అందిస్తానని వెల్లడించాడు. ఈ విషయానికి సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. అందులో... రాయల్ బ్రోంప్టన్ మరియు హేర్‌ఫీల్డ్ హాస్పిటల్స్ స్వచ్ఛంద సంస్థ కోసం నిధుల సేకరణ కోసం నేను నా ప్రపంచ కప్ ఫైనల్ చొక్కాను వేలం వేయబోతున్నాను అంటూ తెలిపాడు. అంతే కాకుండా ఆ షర్టు పైన ఇంగ్లాండ్ జట్టులో సభ్యులందరూ సంతకం చేశారు అని వెల్లడించాడు.