జోస్ బట్లర్ : ఈ రోజుల్లో ఇలాంటి మార్గం కూడా ఉందా...!

జోస్ బట్లర్ : ఈ రోజుల్లో ఇలాంటి మార్గం కూడా ఉందా...!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సందర్భంగా కలకలం సృష్టించిన మాన్కడింగ్ గురించి న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ ఇంగ్లాండ్ బాట్స్మెన్ జోస్ బట్లర్ ను వింతగా ప్రశ్నించాడు. ప్రస్తుతం కరోనా కారణంగా అని మ్యాచ్లు నిలిచిపోవడం తో ఆటగాళ్లు అందరూ ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియాలో బిజీ గా ఉంటున్నారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇష్ సోధీ, జోస్ బట్లర్ చాట్ చేసారు. అందులో "ఏ రాజస్థాన్ రాయల్స్ బాట్స్మెన్ ను మాన్కడింగ్ అవుట్ చేశాడు?" అని ఇష్ సోధి జోస్ బట్లర్‌ను ప్రశ్నించాడు. తరువాత దానికి సమాధానం ఇచ్చిన బట్లర్... నాకు తెలియదు. ఈ రోజుల్లో అవుట్ చేసేందుకు ఇలాంటి  మార్గం కూడా ఉందా...! అని తెలిపాడు. భారత ఆఫ్ స్పిన్నర్, మాజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ బంతిని డెలివరీ చేయడానికి ముందే రాజస్థాన్ రాయల్స్ స్టార్ బట్లర్‌ను నాన్-స్ట్రైకర్ చివరలో మాన్కడింగ్ చేసిన విషయం తెలిసిందే.