జోస్ బట్లర్ వరల్డ్ కప్ టీ షర్ట్ ఎంతకు అమ్ముడుపోయిందంటే...?

జోస్ బట్లర్ వరల్డ్ కప్ టీ షర్ట్ ఎంతకు అమ్ముడుపోయిందంటే...?

కరోనా మహమ్మారిపై పోరాడటానికి ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాట్స్మాన్ జోస్ బట్లర్ తన ప్రపంచ కప్ 2019 ఫైనల్ టీ షర్టును ఆన్‌లైన్‌లో వేలం వేయడం ద్వారా 65,000 పౌండ్ల సేకరించాడు. అంటే అక్షరాలా 60,66,392 రూపాయలు. కరోనావైరస్ వ్యాప్తి సమయంలో బాధితులకు సహాయపడటానికి వేలం నుండి సేకరించిన నిధులను ప్రాణాలను రక్షించే పరికరాలను అందించడానికి ఉపయోగించబడుతుందని బట్లర్ చెప్పాడు. ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్ జట్టులో భాగమైన జోస్ బట్లర్ తన షర్టును అమ్మకానికి పెట్టాడు. 65,100 పౌండ్ల విన్నింగ్ బిడ్తో చొక్కా 82 బిడ్లను ఆకర్షించడంతో మంగళవారం వేలం ముగిసింది. వేలం ద్వారా వచ్చే ఆదాయం లండన్‌లోని రాయల్ బ్రోంప్టన్ మరియు హేర్‌ఫీల్డ్ ఆస్పత్రులకు అందిస్తాను అని తెలిపాడు. అయితే ఆ ప్రపంచ కప్ చొక్కాలో తన ఇంగ్లాండ్ జట్టు సభ్యుల సంతకాలు ఉంటాయని జోస్ బట్లర్ చెప్పాడు. అయితే ఇప్పటివరకు ఇంగ్లాండ్ లో 55 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకగా 6 వేల మందికి పైగా మరణించారు.