ఇంగ్లాండ్-పాకిస్థాన్ : బట్లర్, వోక్స్ కలిసి బాదేశారు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : బట్లర్, వోక్స్ కలిసి బాదేశారు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్  విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ మొదటి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను 209 పరుగులకే ఆల్ ఔట్ చేసింది. దాంతో పాక్ 107 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించిన పాక్ రెండో ఇన్నింగ్స్ లో  తేలిపోయింది. ఇందులో కేవలం 169 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. ఈ ఇనింగ్స్ లో పాక్ తరపున షఫీక్ (29) అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు. దాంతో ఇంగ్లాండ్ లక్ష్యం 276 గా నిర్దేశించబడింది. ఇక తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మొదట 117 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా తర్వాత  వచ్చిన జోస్ బట్లర్(75), క్రిస్ వోక్స్(84) కలిసి జట్టును లక్ష్యానికి దగ్గర చేసారు. కానీ వీరు చివర్లో ఔట్ కాగా బ్రాడ్(7) వచ్చి జట్టుకు విజయం అందించాడు. దాంతో  పాక్ పై ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లలో యాసిర్ షా 4 వికెట్లు సాధించగా షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ అబ్బాస్, నసీమ్ షా ఒక్కో వికెట్ తీసుకున్నారు.