51 ఏళ్ళ వయసులో అదిరిపోయే క్యాచ్లు పడుతున్న జాంటీ రోడ్స్..

51 ఏళ్ళ వయసులో అదిరిపోయే క్యాచ్లు పడుతున్న జాంటీ రోడ్స్..

జాంటీ రోడ్స్ క్రికెట్ ప్రపంచం లో ఎంతో ప్రత్యేకమైన పేరు. ఈ మాజీ క్రికెటర్ 1990 లో  దక్షిణాఫ్రికా జట్టుకు తన అత్యుత్తమ ఫిల్డింగ్ తో సేవలు అందించాడు. తన డైవ్లు, క్యాచ్లు, ఫిల్డింగ్ విన్యాసాలతో ఎంతో మంది స్టార్ బ్యాట్స్మెన్స్ ను పెవిలియన్ కు చేర్చిన ఘనత జాంటీ సొంతం. ఆ ఫిల్డింగ్ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తనలా అద్భుతమైన ఫిల్డర్లు కావాలనుకున్నా ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆ కారణంగానే క్రికెట్ ప్రపంచం లో అత్యుత్తమ ఫిల్డర్ గా గుర్తింపు పొందాడు. భారతదేశంలో ప్రతిష్టాత్మక ఐపీఎల్ టీ 20 లీగ్ లేని క్రికెట్ క్యాలెండర్ కు ఎటువంటి అర్ధం ఉండదు అని చెప్పిన  జాంటీ రోడ్స్ ఈ ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఫిల్డింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. మరో 3 రోజులో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2020 లో ఈ జట్టు సెప్టెంబరు 20న ఢిల్లీ క్యాపిటల్స్ ‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.