145 పరుగులకే భారత్ ఆల్ ఔట్..

145 పరుగులకే భారత్ ఆల్ ఔట్..

ఇంగ్లాండ్ తో జరుగుతున్న పింక్ టెస్ట్ లో భారత 145 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 99 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఈరోజు మరో 46 పరుగులు చేసి మిగిలిన 7 వికెట్లు చేజార్చుకుంది. అయితే ఈ పడిన 7 వికెట్లు మొత్తం స్పినర్లకే పడటం గమనార్హం. అయితే అంతకముందు తమ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కేవలం 112 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత స్పిన్నర్ అక్షర్ 6 వికెట్ లు తీయగా అశ్విన్ మూడు వికెట్లు తీసాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ కంటే భారత్ 33 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం వికెట్లు త్వరగా పడుతుండటంతో మన భారత బౌలర్లు ఏం చేస్తారో చూడాలి.