ఫ్లాష్‌ : జారిపడ్డ జో బిడెన్‌...స్వల్ప గాయాలు

ఫ్లాష్‌ : జారిపడ్డ జో బిడెన్‌...స్వల్ప గాయాలు

ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌పై జో బిడెన్‌ అద్భుత సాధించిన విషయం తెలిసిందే.. ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ పోరులో జో బిడెన్‌ గొప్ప విజయాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారి పడి గాయపడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బో బిడెన్‌ పెంచుకున్న జర్మన్‌ షెపర్డ్‌ జాగిలంతో ఆడుకుంటుండగా జారి పడటంతో చీలమండకు గాయమైంది. దీంతో బిడెన్‌ డెలావేర్‌ లోని ఆర్ధోపెడిక్‌ డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకున్నారని బిడెన్‌ కార్యాలయం పేర్కొంది. జో బిడెన్‌ రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. ఇందులో 2018 లో దత్తత తీసుకున్న మేజర్తో అనే కుక్కతో ఆడుకుంటుండగా జారి పడి గాయపడ్డారు జో బిడెన్‌. బిడెన్‌ 2008 లో ఒక కుక్కను దత్తత తీసుకున్నారు. బిడెన్‌ తో పాటు తన రెండు పెంపుడు కుక్కలు కూడా వైట్‌ హౌస్‌కు రానున్నాయి.