క‌రోనాతో మాజీ మంత్రి క‌న్నుమూత‌

 క‌రోనాతో మాజీ మంత్రి క‌న్నుమూత‌

క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డంలేదు.. సామాన్యుల నుంచి వీవీఐపీల వ‌ర‌కు ఎంతో మంది కోవిడ్ బారిన ప‌డ‌గా.. చాలా మంది ప్ర‌ముఖులను సైతం కోవిడ్ పొట్ట‌న‌బెట్టుకుంది.. తాజాగా. కరోనా బారిన పడిన బీహార్ మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి మృతిచెందారు.. క‌రోనా సోకిన త‌ర్వాత పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయ‌న‌.. చికిత్స పొందుతూ ఇవాళ‌ కన్నుమూశారు. ఆయ‌న‌.. తారాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి జేడీయూ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.. మేవాలాల్ చౌదరికి సీఎం నితీష్ కుమార్ త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పించారు.. విద్యాశాఖ మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.. అయితే, ఆరోపణల నేప‌థ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 3 రోజుల క్రిందట కోవిడ్ సోకడంతో.. ఆయ‌న‌ను ఆస్ప‌త్రి త‌ర‌లించారు.. చికిత్స పొందుతూ ఇవాళ క‌న్నుమూశారు.. ఆయ‌న మృతికి సీఎం నితీష్ కుమార్ స‌హా ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం వ్య‌క్తం చేశారు.