కోర్టుకు వెళితే కొన్న వాళ్లు నాశనం అవుతారు.. న్యాయం అనేదే లేదు !

కోర్టుకు వెళితే కొన్న వాళ్లు నాశనం అవుతారు.. న్యాయం అనేదే లేదు !

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడే తీరు మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయనకు ఏ భాషలో చెప్పినా అర్థం కావడం లేదన్నారు ఆయన. తాడిపత్రి మండలం బొందల దిన్నె వంగనూరు గ్రామం వద్ద ఓ కంపెనీ కోసం రైతుల నుంచి భూములు తీసుకున్నారని ఇప్పుడు కంపెనీ రానందున భూములు తిరిగి ఇచ్చేయాలని జేసీ డిమాండ్ చేశారు. నేను కోర్టుకు వెళితే కొన్న వాళ్లు నాశనం అవుతారని.. అందుకే తాను అలా చేయదలుచు కోలేదని జేసీ స్పష్టంచేశారు.

ఈ విషయంలో ఎమ్మెల్యే స్పందించాలని ఆయనకు చేత కాక పోతే జగన్ లాగా సలహాదారులను పెట్టుకోవాలని అన్నారు. నా కేసుల మీద కర్ణాటక లోకాయుక్తలో కేసులు వేశారన్న ఆయన ఇక్కడ మాత్రం రాత్రికి రాత్రే అరెస్టు చేసి జైళ్లో పెట్టారని అన్నారు. ఇక్కడ న్యాయం అనేదే లేదన్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా లేవని... అధికార పార్టీ వారు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారని అన్నారు. నిమ్మగడ్డ దిగి పోయేలోగా సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేయాలని చూస్తున్నారని ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.