మరోసారి పోలీస్ కస్టడీకి జేసీ .!

మరోసారి పోలీస్ కస్టడీకి జేసీ .!

సీఐపై దురుసుగా వ్య‌వ‌హ‌రించిన కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం జేసీ ని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. విచారణ జరిపేందుకు జేసీని కస్టడీకి ఇవ్వాల‌ని పోలీసులు కోర్టును కోరారు. దాంతో కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.  ఈ మేరకు పోలీసులు ఆదివారం జేసీ ని విచారించనున్నట్టు తెలుస్తోంది. మ‌రోవైపు వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన‌ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దానిపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.