సీఎం జగన్ వల్లే జేసీకి కరోనా వచ్చింది : లోకేష్

సీఎం జగన్ వల్లే జేసీకి కరోనా వచ్చింది : లోకేష్

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో ప్రభాకర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడం పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు.  ఒక పక్క కరోనా.. మరోపక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో సీఎం బిజీగా ఉన్నారని లోకేశ్‌ మండిపడ్డారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల అయిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్లీ అరెస్టు చేశారని లోకేశ్‌ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరమన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా సోకడానికి సీఎం  జగన్‌ నేర మనస్తత్వమే కారణమని విమర్శించారు. కడప జైలులో 317 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్న ఆయన.. తక్షణమే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు.