జేసీ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఉన్నంత వరకు ఎన్నికలు జరగవు..!

జేసీ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఉన్నంత వరకు ఎన్నికలు జరగవు..!

సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి హాట్ కామెంట్లు చేశారు... పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సర్కార్ మధ్య వివాదం నడుస్తోన్న సమయంలో.. ఈ వ్యాఖ్యలు ఆసక్తికరమంగా మారాయి.. ఇక, ఆయన వ్యాఖ్యల విషయానికి వస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ పదవిలో ఉన్నంత వరకు... ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోవని కుండబద్దలు కొట్టారు జేసీ... స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేయడం వెనక ప్రభుత్వం ఎత్తుగడ ఉందన్న ఆయన... జస్టిస్ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించి.. ఏకగ్రీవం చేసుకునే ఎత్తుగడలో ప్రభుత్వం ఉందని చెప్పుకొచ్చారు. నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా... ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం ఖాయం అన్నారు జేసీ దివాకర్‌ రెడ్డి. మరోవైపు.. నంద్యాల ఘటన బాధాకరమన్న జేసీ... ఈ ఘటనతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదన్నారు. ఇక, నేను ఇంత గొప్ప ప్రభుత్వాన్ని వినలేదు, కనలేదు అని ఎద్దేవా చేశారు జేసీ దివాకర్‌రెడ్డి.