జేసీ సంచలనం.. చంద్రబాబు గొంతుమీద కత్తి పెట్టి పగ తీర్చుకుంటా..!

జేసీ సంచలనం.. చంద్రబాబు గొంతుమీద కత్తి పెట్టి పగ తీర్చుకుంటా..!

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఏ విషయం అయినా ముక్కుసూటిగా చెప్పేస్తారు.. ఆయన ఏం మాట్లాడినా సంచలనంగా మారిపోతోంది... ఓవైపు ఆయన కుటుంబాన్ని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మరోవైపు ఏమాత్రం తగ్గకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్‌ రెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ కంటే రెండింతలు చంద్రబాబు ఎక్కువ పాలన చేయాలి అని సూచించారు. రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు.. మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తామంతా విశ్వసిస్తున్నామన్న జేసీ.. ఆయన సపోర్టర్స్‌ అయిన మేం.. ఆయన గొంతు మీద కత్తిపెట్టి చేస్తావా, చెయ్యవా, నువ్వు చెయ్యకపోతే ఎలా అని ప్రశ్నిస్తామంటూ అంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 

ఇక, చంద్రబాబు సాత్వికుడు, దుర్మార్గపు ఆలోచనలు లేవన్నారు జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్యాయం జరిగింది.. పార్టీ అండ ఉంటుందని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి.. అండ లేదు, బండ లేదు.. మా నెత్తిన రాళ్లు పడ్డాయి మాకు ఇబ్బందులు కలగజేసిన వారు, బాధపెట్టిన వారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మరి, వారిపై కేసులు చూపిస్తాం ఏం యాక్షన్ తీసుకుంటావ్.. యాక్షన్ తీసుకోకపోతే నీ నాయకత్వం మాకు ఎందుకు అంటూ ప్రశ్నించారు.. ఒకవేళ చంద్రబాబు యాక్షన్ తీసుకోకతే.. ఇంకో మాట అంటాం.. ఇదేదో మూడో రకం అనుకోవాల్సి వస్తుంది అంటూ ఘాటుగా స్పందించారు జేసీ దివాకర్‌రెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసి జేసీ దివాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...