టీడీపీకి షాక్‌ ఇచ్చిన జేసీ...

టీడీపీకి షాక్‌ ఇచ్చిన జేసీ...

అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టి మరీ అనుమతి సాధించుకున్న తెలుగుదేశం పార్టీకి సొంత పార్టీ పార్లమెంట్ సభ్యుడు షాక్ ఇచ్చారు. తాను పార్లమెంట్‌కు వెళ్లేదిలేదంటున్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి... ప్రస్తుతం అనంతపురంలోనే ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి... విప్ జారీ చేసినా... ఢిల్లీకి వెళ్లేది లేదని తేల్చేశారు. కేంద్రం, రాష్ట్రంలో రాజకీయాలు సరైన రీతిలో లేవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న జేసీ దివాకర్ రెడ్డి... పార్లమెంట్‌లో టీడీపీ సభ్యులు సమర్థవంతంగా తమ వాణిని వినిపిస్తారని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ఒరిగేదేమీలేదన్న టీడీపీ ఎంపీ... ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప... కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో జేసీ తీరు చర్చనీయంగా మారింది.