నేను చచ్చిపోవాలా : జయప్రద

నేను చచ్చిపోవాలా : జయప్రద

రాంపూర్ రాజకీయం వేడెక్కుతోంది.  బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదను ఉద్దేశించి ఎస్పీ అభ్యర్థి అజంఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.  జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది తానేనని కానీ అప్పుడు ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుందని గుర్తించలేకపోయాయని అజంఖాన్ అన్నారు.   దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.   అజంఖాన్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. 

అజంఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన జయప్రద 'ఇవన్నీ నాకు కొత్త కాదు.  ఆయనకు నేనేం చేశాను.  నేను చచ్చిపోవాలా.  అలా చేస్తే ఆయన శాంతిస్తారా.  ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాంపూర్ వదిలి వెళ్ళిపోతానని అనుకుంటున్నారేమేమో.  నేను ఎక్కడికీ వెళ్ళను.  ఇలాంటి వ్యక్తులు గెలిస్తే మహిళలకు రక్షణ ఏం ఉంటుంది' అంటూ మండిపడ్డారు.