అసలేం జరిగిందంటే...!

అసలేం జరిగిందంటే...!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి పట్ల ఇప్పటికీ ఎన్నో అనుమానాలు. ఆమెకు సంబంధించిన కొత్త వార్త రోజూ ఒకటి తెరపైకి వస్తున్నాయి. తాజాగా జయలలిత దగ్గర  25 ఏళ్లుగా కారు డ్రైవర్ గా ఉన్న కన్నన్ తన వాంగ్మూలాన్ని.... జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట వినిపించాడు. 2016 సెప్టెంబర్ 22 తేదీన తాను అమ్మ గదిలోకి వెళితే ఆమె అప్పటికే చైర్ లో అపస్మారక స్థితిలో కూర్చొని ఉన్నారని కమిషన్ ఎదుట వివరించాడు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ వీర పెరుమాల్ తనను వెంటనే వెళ్లి కారు తీసుకుని రావాలని ఆదేశించారు. తాను పరుగున వెళ్లి కారు తీసుకొచ్చానని తెలిపారు. అయితే... అమ్మ పనిమనిషి పెద్ద కారు తీసుకుని రావాలని చెబితే.... తాను మరో కారు తీసుకుని వచ్చానని డ్రెవర్ తెలిపాడు. అక్కడే ఉన్న చిన్నమ్మ శశికళ ఆదేశాల మేరకు తాను పై అంతస్థులో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్లానని కమిషన్ ఎదుట పేర్కొన్నాడు. అప్పటికే అమ్మ అపస్మారక స్థితిలో కుర్చీలో ఉన్నారు. ఆ పక్కనే ఫైల్స్ , క్యాప్ తీసిన పెన్ను పడి ఉందని కమిషన్ కు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత కుర్చీ నుంచి జారిందనీ.. అంతలోనే తాను అమ్మను స్ట్రెచర్ పై తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. అదే సమయంలో శశికళ బంధువులు, జయలలిత వ్యక్తిగత సలహాదారుడు శివకుమార్ పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.