బుమ్రాకు కలిసొచ్చిన కోహ్లీ వికెట్...

బుమ్రాకు కలిసొచ్చిన కోహ్లీ వికెట్...

ముంబై ఇండియన్స్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టీ 20 ఫార్మాట్‌ లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే నిన్న అబుదాబిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో బుమ్రా ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ వికెట్‌తో, బుమ్రా ఐపీఎల్ లో 100 వికెట్లు సాధించిన 15వ బౌలర్ గా నిలిచాడు. అయితే ఐపీఎల్ లో జస్‌ప్రీత్ బుమ్రా తీసిన మొదటి వికెట్ మరియు 100వ వికెట్ రెండు విరాట్ కోహ్లీ కావడం గమనార్హం. ఐపీఎల్ 2013 లో బుమ్రా తీసిన మొదటి వికెట్ కోహ్లీదే.. అలాగే ఇప్పుడు 7 సంవత్సరాల తరువాత బుమ్రా తన 100 ఐపీఎల్ వికెట్ రూపంలో కూడా మళ్ళీ కోహ్లీ నే ఔట్ చేసాడు. అయితే ఈ వికెట్ తోనే బుమ్రా 200 టీ 20 వికెట్లు సాధించిన 6వ భారత బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. 200 టీ 20 వికెట్లకు పైగా తీసిన భారత బౌలర్లలో పియూష్ చావ్లా (257), అమిత్ మిశ్రా (256), రవిచంద్రన్ అశ్విన్ (242), హర్భజన్ సింగ్ (235), యుజ్వేంద్ర చాహల్ (205) బుమ్రా ముందున్నారు.