జాన్వీ కూడా అలాంటి సినిమానే ఎంచుకుందా..?

జాన్వీ కూడా అలాంటి సినిమానే ఎంచుకుందా..?

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో హిట్ కొట్టింది.  లైన్లో రెండుమూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.  అందులో ఒకటి బయోపిక్ సినిమా కాగా రెండోది కరణ్ జోహార్ తక్త్.  ఈ రెండు సినిమాతో పాటు మరో సినిమాకు కూడా జాన్వీ సైన్ చేసినట్టు తెలుస్తోంది.  బాలీవుడ్ లో ప్రస్తుతం హర్రర్ కామెడీ మూవీస్ కు మంచి గిరాకీ ఉంది.  హర్రర్ ను కామెడీతో మిక్స్ చేసి తీస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది.  

ఇలా వచ్చిన సినిమానే స్త్రీ.  చిన్న సినిమాగా వచ్చిన... భారీ హిట్టైంది.  అందుకే ఇప్పుడు  దర్శక నిర్మాతల చూపులు అటువైపే ఉన్నాయి.  ఇలాంటి హర్రర్ కామెడీ సినిమాలో జాన్వీ నటిస్తున్నట్టు సమాచారం.  ఓ స్త్రీ సినిమాలో నటించిన రాజ్ కుమార్ రావు హీరోగా చేస్తున్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తోందట.  ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.