జనసేన ఒక వర్గానికి చెందిన పార్టీ..రాపాక సంచలన వ్యాఖ్యలు

జనసేన ఒక వర్గానికి చెందిన పార్టీ..రాపాక సంచలన వ్యాఖ్యలు

రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మలికిపురం మండలంలో గూడపల్లి పల్లిపాలెం ఎస్సీ సొసైటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార  సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన ఒక వర్గానికి చెందిన పార్టీ అయినందువల్ల ఆ పార్టీకి భవిష్యత్తులో ఉనికి ఉండదని అన్నారు. తన గెలుపుకు అన్ని కులాలు సహకారం అందించడంతో దేవుని దయతో గెలుపొందానన్న ఆయన రాజోలు నియోజకవర్గం వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయని అందులో నాదో గ్రూపని అన్నారు. ఈ వర్గాలు అంతం కావలంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని ఈ కుమ్ములాటలు పార్టీకీ మంచిది కాదని త్వరలోనే ఫుల్ స్టాప్ పడతాయని అన్నారు.