స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో జ‌న‌సేనాని..

స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో జ‌న‌సేనాని..

దేశ‌వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి... హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన కార్యాల‌యంలో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్. జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు ప‌వ‌న్.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య‌ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. జాతీయ పతాకానికి వందనం చేసిన త‌ర్వాత‌.. భారతమాత, గాంధీజీ చిత్రపటాలకు పుష్ఫాంజ‌లి అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓవైపు వ‌ర్షం కురుస్తున్నా.. మ‌రోవైపు స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.