నివర్ తుఫాన్‌: జనసైనికులకు పవన్ విజ్ఞప్తి

నివర్ తుఫాన్‌: జనసైనికులకు పవన్ విజ్ఞప్తి

‘నివర్ తుఫాన్‌’ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతాంగం దెబ్బతినడం బాధాకరం అన్నారు. అప్పుల పాలైపోతున్న రైతులను మరింత కుంగదీసే విధంగా ఈ నష్టాలు ఉన్నాయి. పెట్టుబడి రాయితీతో పాటు పంటల బీమాను సకాలంలో అందించాలని పవన్ కోరారు.  
నివర్ తుపాన్ మూలంగా ఇళ్ళల్లోకి నీళ్ళు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. నిరాశ్రయులుగా మిగిలిన వారిని తక్షణమే ఆదుకొనే చర్యలను ప్రభుత్వం చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలని పవన్ కోరారు.

రాబోయే కొద్ది రోజుల్లో మరో తుఫాను పొంచి ఉందని, ప్రజలను ముందుగా అప్రమత్తం చేసే చర్యల్లో జనసైనికులు భాగస్వాములు కావాలని పవన్‌కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.