ప్రభుత్వ వైఖరి వల్లే తేజస్విని ఆత్మహత్య-పవన్ కల్యాణ్‌

ప్రభుత్వ వైఖరి వల్లే తేజస్విని ఆత్మహత్య-పవన్ కల్యాణ్‌

ఒంగోలుకు చెందిన ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థిని తేజస్విని మృతి విషయంలో ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే బీటెక్‌ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు పవన్.. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదని అన్నారు. ప్రభుత్వ విధానం కారణంగా పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మరణించిన తేజస్వీ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కొద్ది నెలల కిందట కూడా ఒంగోలులో క్విస్ విద్యా సంస్థ ఇదే రీతిలో వ్యవహరిస్తే జనసేన పేద విద్యార్థుల పక్షాన నిలిచిందని గుర్తుచేశారు.