తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన...

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన...

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు.  రేపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడబోతున్నారు.  డిసెంబర్ 3,4,5 వ తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు.  ఆయా జిల్లాల్లో తుఫాన్ బాధిత రైతులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.  పంట నష్టంపై అంచనా వేసి రైతులకు భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది.  ఇటీవలే వచ్చిన నివర్ తుఫాన్ దెబ్బకు తమిళనాడుతో పాటుగా ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.  వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. ఇటు నివర్ ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాలపై కూడా పడిన సంగతి తెలిసిందే.