గుంటూరు జీజీహెచ్‌ దగ్గర ఉద్రిక్తత

గుంటూరు జీజీహెచ్‌ దగ్గర ఉద్రిక్తత


గుంటూరు జీజీహెచ్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అత్యాచార బాధితురాలని పరామర్శించేందుకు వచ్చిన ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను నిరసనకారులు అడ్డుకున్నారు. అప్పటికే ఆందోళన చేస్తున్న జనసేన, టీడీపీ, లెఫ్ట్‌పార్టీల కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దిశ చట్టాన్ని అమలు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎట్టకేలకి లోపలి వెళ్ళిన వాసిరెడ్డి పద్మ చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.  సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఇలాంటి ఘటనకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఈ  కేసు దిశ చట్టం అమలు చేస్తామని చెప్పారు పద్మ.

విచారణ తర్వాత కఠిన శిక్షలు ఉంటాయనిన తెలిపారు. మరెవ్వరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చర్యలుంటాయని వెల్లడించారు. అయిదేళ్ల బాలికపై అత్యాచార ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్న ఆమె బాలిక కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడటం దారుణమని చెప్పారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.