రాజకీయాలపై జానారెడ్డి సంచలన నిర్ణయం 

రాజకీయాలపై జానారెడ్డి సంచలన నిర్ణయం 

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది.  ఈ ఎన్నికల్లో తెరాస పార్టీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది.  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి సాగర్ నుంచి పోటీ చేశారు. గతంలో ఆయనకు ఈ స్థానంపై మంచి పట్టు ఉన్నది.  ఆ పట్టుతో ఈసారి అక్కడ విజయం సాధిస్తారని అనుకున్నారు.  కానీ, తెరాస పార్టీ సాగర్ ఉప ఎన్నికల్లో మంచి విజయం సాధించింది.  సాగర్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని అన్నారు.  ఈ ఎన్నికల్లో తన కోసం పనిచేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి 47శాతం, కాంగ్రెస్ కు 37శాతం ఓట్లు పోలైనట్టు జానారెడ్డి పేర్కొన్నారు.  తన ఆశయాలు ప్రజలకు అందితే చాలని, ఇకపై ఎలాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయనని అన్నారు.  రాబోయే కాలంలో రాజకీయ విమర్శలు చేయనని అన్నారు.  విలువలతో కూడిన రాజకీయాలు రావాలని, పార్టీకి సలహాలు సూచలను మాత్రమే ఇస్తానని జానారెడ్డి పేర్కొన్నారు.