కోహ్లీ చాలా మారిపోయాడు : అండర్సన్

కోహ్లీ చాలా మారిపోయాడు : అండర్సన్

ప్రస్తుత క్రికెట్ ప్రపంచం లో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడు ఫార్మాట్ లలో టాప్ 10 లో నిలిచాడు కోహ్లీ. అటువంటి ఉత్తమ  ఆటగాళ్లను అవుట్ చేయడం సరదాగా ఉంటుందని ఇంగ్లాండ్ సీనియర్  ఫాస్ట్ బౌలర్ జేమ్స్  అండర్సన్ తెలిపాడు. అలాగే 2014 కి 2018 కి కోహ్లీలో చాలా మార్పు వచ్చిందని అన్నాడు. అండర్సన్ మాట్లాడుతూ...2014 లో భారత్ తో టెస్ట్ సిరీస్ ఆడిన సమయంలో కోహ్లీ పైన నేను ఆధిపత్యం చెలాయించాను. అప్పుడు అతను బ్యాట్ ను ఫాస్ట్ గా కదిపే వాడు. అది నాకు కలిసి వచ్చింది. కానీ మళ్ళీ 2018 కి వచ్చే సరికి అతని ఆటలో చాలా మార్పు వచ్చింది. ఈ సిరీస్ లో అతను బౌలర్లను చాలా కష్టపెట్టాడు. మమల్ని విసిగిస్తూ పరుగులు చేసాడు అని తెలిపాడు. అయితే 2014 సిరీస్ లో కోహ్లీ మొత్తం 10 ఇన్నింగ్స్ లో కలిపి 134 పరుగులు చేస్తే 2018 లో 8 ఇన్నింగ్సులోనే 593 పరుగులు చేసి ఆ సిరీస్ లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అందులో రెండు శతకాలు, మూడు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మధ్యే టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్ గా  అండ‌ర్స‌న్ రికార్డ్ సృష్టించాడు. పాకిస్థాన్ తో జరిగిన చివరి టెస్ట్ చివరి రోజు పాక్ కెప్టెన్ అజార్ అలీని ఔట్ చేసి అండ‌ర్స‌న్ ఈ ఘనత సాధించాడు. అయితే ఈ ఇద్దరు టాప్ ఆటగాళ్లు మళ్ళీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే సిరీస్ లో కలుసుకోనున్నారు.