అయోధ్యలో ఉగ్రదాడులకు ఉగ్ర కుట్ర!

అయోధ్యలో ఉగ్రదాడులకు ఉగ్ర కుట్ర!

అయోధ్యలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కుట్రపన్నుతున్నట్టు భారత నిఘావర్గాలు పసిగట్టాయి.  జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ భారత్‌లో ఉన్న తమ ఉగ్రవాదులకు టెలిగ్రామ్ యాప్‌ లో పంపించిన సందేశాన్ని భారత నిఘావర్గాలు డీకోడ్ చేశాయి. ఆ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయోధ్యలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్రపన్నుతున్నట్టు భద్రతా అధికారులు గ్రహించారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖతో పాటు అన్ని భద్రతా బలగాల విభాగాలకు తెలియజేసిన నిఘావర్గాలు.. అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించాయి. నిఘావర్గాల హెచ్చరికలతో భారత్‌లోని జైషే మహమ్మద్ నెట్‌వర్క్‌పై ఓ కన్నేసిన భద్రతా బలగాలు.. అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. అయోధ్యలో రద్దీగా ఉండే అన్ని ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దశాబ్ధాల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య వివాదంలో ఇటీవలే సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.