'వెబ్ సిరీస్'లో  జగ్గుభాయ్!

'వెబ్ సిరీస్'లో  జగ్గుభాయ్!

ఫ్యామిలీ హీరోగా అలరించి ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని  లెజెండ్ సినిమాతో విలన్ గా మారారు జగపతి బాబు. లెజెండ్ తర్వాత విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వరుసగా రంగస్థలం, అరవింద సమేత సినిమాలలో జగపతి బాబు నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే జగ్గూ భాయ్‌ రెండేళ్ల క్రితమే గ్యాంగ్‌స్టర్స్‌ చిత్రంతో డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. తాజాగా మరోసారి వెబ్‌సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్నట్టు ఫిలింనగర్‌ లో వార్త చక్కర్లు కొడుతోంది.  బాహుబలి సినిమా నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ పతాకం పై ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాట. అయితే సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సిరీస్  కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.