వైయ‌స్ జయంతి : ఇడుపులపాయకు జగన్

వైయ‌స్ జయంతి : ఇడుపులపాయకు జగన్

దివంగ‌త సీఎం  వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి నేడు ఇడుపుల‌పాయ‌ వెళ్ళారు. రేపు రాజ‌శేఖ‌ర‌రెడ్డి జయంతి సందర్భంగా జిల్లాలో సీఎం ప‌ర్యటిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ హరికిరణ్ లు స్వాగతం పలికారు.

అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయకు వెళ్ళారు సీఎం జగన్. అక్కడ వైఎస్సార్ ఎస్టేట్స్‌లోని గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో వైయ‌స్ఆర్  విగ్రహావిష్కరణ, ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ తరగతి గదుల ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన ఉండనుంది.  తర్వాత 3 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ అతిథి గృహానికి వెళ్తారు.. మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.